నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా
మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై, అంతలో దూరమై అందవా స్నేహమా
నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా
రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా
ఎక్కడ వాలను చెప్పు నువ్వే సావాసమా
హద్దులు చెరిపిన చెలిమి నువై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా
నడకలు నేర్పిన ఆశవు కదా
తడబడనీయకు కదిలిన కథ
వెతికే మనసుకు మమతే పంచుమా
నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా
ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమ్రుతమనుకొని నమ్మటమే ఒక శాపమా
నీ ఒడి చేరిన ప్రతి మదికి భాదే ఫలితమా
తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా
పెదవుల పై చిరు నవ్వుల దగ
కనపడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా
నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా, తీరులో ప్రళయమా
పంతమా బంధమా
నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా
Comments (0)