S. Janaki – Edalo Laya Lyrics

పపగ పపగ
పపగ
పపగ
పపగ పస
పపగ పస
ఎదలో లయ ఎగసే లయ
ససమా నినిరీ
ససమా నినిరీ
గగగ మమమ ససస ససస ససస
ఎదలో లయ ఎగసే లయ
ఎగసి ఎగిరి ఎదలో ఒదిగి
శుకమా స్వరమా పికమా పదమా శుకమా

గాగా
ఆ ఆ
దివ్యమే నీ దర్శనం శ్రావ్యమేలే స్పందనం
శోధనే నా జీవనం సాధనేలే జీవితం
జతలే శ్రుతులై పలికే ఆలాపన
వెతికి వెతికి బ్రతుకే అన్వేషణ
నాలో నేడే విరులవాన
ఎదలో లయ ఎగసే లయ
ఎగసి ఎగిరి ఎదలో ఒదిగి
శుకమా స్వరమా పికమా పదమా శుకమా

కోకిలగీతం
తుమ్మెదనాదం
కోకిలగీతం తుమ్మెదనాదం
జలజల పారే సెలగానం
ఘుమఘుమలాడే సుమరాగం
అరెరె ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
కొండ కోన ఎండ వాన ఏకమైన ప్రేమగీతం
ఔనా మైనా నీవే నేనా
శుకపికముల కలరవముల స్వర లహరులలో

సససస దదదద పపపప రిరిరిరి నినినిని సససస
రిరిరిరి నినినిని సససస
పలికే చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ
విరుల తెరలో జరిగేదేమో మరులే పొంగి పొరలిన వేళ
పలికే చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ
సససస
సససస
విహంగమా సంగీతమా
విహంగమా సంగీతమా
సంగీతమే విహంగమై చరించగా
స్వరాలతో వసంతమే జ్వలించగా
ఎన్నాళ్లు సాగాలి ఏకాంత అన్వేషణ
అలికిడి ఎరుగని తొలకరి వెలుగులలో

పలికే చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ
విరుల తెరలో జరిగేదేమో మరులే పొంగి పొరలిన వేళ
సససస దదదద పపపప
సససస దదదద పపపప

Comments (0)