దోబూచులాటేలరా
దోబూచులాటేలరా గోపాల
దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా
దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా
ఆ యేటి గట్టు నే నడిగ
చిరు గాలి నాపి నే నడిగ
ఆ యేటి గట్టు నే నడిగ
చిరు గాలి నాపి నే నడిగ
ఆకాశాన్నడిగ బదులే లేదు
ఆకాశాన్నడిగ బదులే లేదు
చివరికి నిన్నే చూశా
హౄదయపు గుడిలో చూశా
చివరికి నిన్నే చూశా
హౄదయపు గుడిలో చూశా
దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా
నా మది నీకొక ఆటాడు బొమ్మయ
నా మది నీకొక ఆటాడు బొమ్మయ
నాకిక ఆశలు వేరేవి లేవయ్య
ఎదలో రొదాగదయా
నీ అధరాలు అందించ రా గోపాలా
నీ అధరాలు అందించ రా గోపాల
నీ కౌగిళిలో కరిగించ రా
నీ తనువే ఇక నా వలువా
పాలకడలి నాడి నా గానం
నీ వన్నె మారలేదేమి
పాలకడలి నాడి నా గానం
నీ వన్నె మారలేదేమి
నా ఏదలొ చేరి వన్నె మర్చుకో
ఊపురి నీవై సాగ
పెదవుల మెరుపు నువు కాగ చేరగ రా
దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా
గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు
గగనమే వర్షించ గిరి నెత్తి కాచావు
నయనాలు వర్షించ నన్నెట్ట బ్రోచేవు
పువ్వున కన్నే నీ మతమా
నేనొక్క స్త్రీ నే కదా గోపాల
అది తిలకించ కనులే లేవా
నీ కలలే నేనే కదా
అనుక్షణము ఉలికె నా మనస్సు
అరె మూగ కాదు నా వయస్సు
నా ఊపిరిలోన ఊపిరి నీవై
ప్రాణం పోనీకుండ ఎప్పుడు
నీవే అండ కాపాడ రా
దోబూచులాటేలరా గోపాల
నా మనసంత నీవేనురా
Comments (0)