మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగము నీ కనుల నే కనుగొంటిలే
నీ మనసు నాదనుకొంటిలే

కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆ...

ఆనందముతో అమృత వాహిని ఓలలాడి మైమరచితిలే
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
ముసిముసి నవ్వుల మోము గని నన్నేలుకొంటివని మురిసితిలే

రుసరుసలాడుతు విసిరిన వాల్జెడ వలపు పాశమని బెదరితిలే

Comments (0)