ఎవరికోసం
ఎవరికోసం
ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఈ భగ్న హృదయం ఈ అగ్ని గుండం
ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం
ప్రేమభిక్ష నువ్వే పెట్టీ ఈ పేద హృదయం పగులగొట్టీ
పిచ్చివాణ్ణి పాత్రలేని బిచ్చగాణ్ణి చేశావు
నువ్వివనిదీ తాకలేనూ
ఇంకెవరినీ అడుగలేనూ
బ్రతుకు నీకు ఇచ్చాను
చితిని నాకు పేర్చావు
ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం
ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం.
ఓర్వలేని ఈ ప్రకృతి ప్రయళంగా మారనీ
నా దేవి లేని ఈ కోవెల తునాతునకలై పోనీ
కూలిపోయి ధూళిలో కలసిపోనీ
కాలిపోయి బూడిదే మిగలనీ
ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం
ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం ఎవరికోసం
మమత నింపమన్నానూ మనసు చంపుకొన్నావూ
మధువు తాగనన్నాను విషం తాగమన్నావూ
నీకు ప్రేమంటే నిజం కాదూ నాకు చావంటే భయంలేదూ
నీ విరహంలో బ్రతికానూ
ఈ విషంతో మరణిస్తానూ
మరణిస్తానూ
Comments (0)